మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 9 నవంబరు 2019 (20:26 IST)

అబ్బాయి/అమ్మాయి బొద్దుగా ఉన్నారా? అయితే ఈ సమస్యలు ఎదురవుతాయి

ఇటీవల చాలామంది పిల్లలు బొద్దుగా కనిపిస్తున్నారు. ఉయ్యాలలో ఉన్న పిల్లలు బొద్దుగా ఉండడం సరే గానీ నడక నేర్చిన తరువాత పిల్లల్లో వయస్సుకు తగ్గినట్లుగా బరువు ఉండాలి. అదనపు క్రొవ్వులు చేరడం మంచిది కాదంటున్నారు వైద్యులు.

బాల్యంలోనే లావుగా తయారయ్యే మగపిల్లలు ఆ వయస్సులో సాటి పిల్లల చేత వెక్కిరింతలకు గురవుతారు. తన వయస్సు వారితో కలిసి పరిగెట్టలేరు. ఆటలు ఆడలేరు. అయితే సమస్యలు అంతటితో ఆగవు అంటున్నారు చిలి విశ్వవిద్యాలయ పరిశోధకులు.
 
బాల్యంలో భారీకాయం వచ్చిన పిల్లలలో లైంగికంగా వచ్చే మార్పులు చిన్న వయస్సులోనే వస్తాయట. మగ పిల్లలలో 9 యేళ్ళ వయస్సుకే లైంగిక మార్పులు మొదలవుతాయట. ఇలా తక్కువ వయస్సులోనే వచ్చే మార్పులు వారికి మానసికపరమైన ఇబ్బందులను కలిగిస్తాయట.
 
అంతేకాకుండా వారిలో భావోద్వేగ సమస్యలు తలెత్తేలా చేస్తాయట. కుంగుబాటుకు గురవుతారట. కోపతాపాలు పెరుగుతాయట. చిరాకుకు గురవుతారట. చిరుకారణంతోనే భౌతిక దాడులకు దిగుతారట. ఇలాంటి వారిని బాగా బుజ్జగించాలట. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే వ్యాయామాలు చేయిస్తే ఉపయోగం ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.