గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (09:51 IST)

త్వరలోనే చిన్నపిల్లలకు కరోనా టీకాలు : డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి

దేశంలో త్వరలోనే చిన్న పిల్లలకు కరోనా టీకాలు వేస్తామని అపోలో ఆస్పత్రి గ్రూపు సంస్థల అధినేత డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదలు చేశారు. 
 
తొలుత సహరుగ్మతలు(కోమార్బిడిటీస్‌)తో బాధపడుతున్న పిల్లలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఆమోదం రావాల్సి ఉందన్నారు. ‘2-18 సంవత్సరాల వయసుల వారికి కొవాగ్జిన్‌ టీకా సిద్ధమైంది. 28 రోజుల వ్యవధిలో రెండు మోతాదుల్లో ఇవ్వాలి. ఇంట్రా-మస్కులరీ విధానంలో వేస్తారు. 
 
12-18 సంవత్సరాల వయసు వారికి జైకోవ్‌-డి టీకా 28 రోజుల వ్యవధిలో మూడు డోసులు ఇవ్వాలి. ఇది సూది రహిత వ్యాక్సిన్‌ అని వెల్లడించారు. టీకాలతోనే పిల్లలకు పూర్తి రక్షణ అన్నారు. వయస్సు-సమూహ వివరాలు అందిన తరువాత కార్యక్రమం ప్రారంభించనున్నామని చెప్పారు.