సోమవారం, 21 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 19 మే 2016 (18:34 IST)

ఢిల్లీ పురుషుడి పురుషాంగం ఫ్రాక్చర్... మెడికల్ జర్నల్ అది కేస్ స్టడీ...

ఎక్కడైనా దేహంలో ఎముకలు ఫ్రాక్చర్... అంటే విరిగిపోవడం వంటి వాటి గురించి మనం వింటూ ఉంటాం. కానీ స్పాంజి లక్షణాలతో ఉన్న పురుషాంగం ఫ్రాక్చర్ అయింది అంటే నమ్మలేం. కానీ ఇది జరిగింది. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల యువకుడు సెక్స్ చేస్తున్న సమయంలో అడ్డదిడ్డంగా ఆ ప్ర

ఎక్కడైనా దేహంలో ఎముకలు ఫ్రాక్చర్... అంటే విరిగిపోవడం వంటి వాటి గురించి మనం వింటూ ఉంటాం. కానీ స్పాంజి లక్షణాలతో ఉన్న పురుషాంగం ఫ్రాక్చర్ అయింది అంటే నమ్మలేం. కానీ ఇది జరిగింది. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల యువకుడు సెక్స్ చేస్తున్న సమయంలో అడ్డదిడ్డంగా ఆ ప్రక్రియను జరిపాడు. దానితో స్తంభించి ఉన్న పురుషాంగా సెక్స్ చేస్తున్న సమయంలో ఫ్రాక్చర్ అయింది. ఎలాగంటే... సెక్స్ చేస్తున్న సమయంలో సజావుగా చేయనప్పుడు పురుషాంగం మెలితిరిగిపోవడమో లేదంటే వేగంగా చేస్తున్న సమయంలో గబుక్కున చీరుకుపోయినట్లు అయిపోయి గాయాలు కావడం వంటివి ఫ్రాక్చర్ కిందకి వస్తాయంటున్నారు వైద్యులు. 
 
ఆ యువకుడు కూడా ఇలాంటి సమస్యతో ఢిల్లీ ఆసుపత్రికి రావడంతో సమస్యను క్షుణ్ణంగా పరిశీలించారు వైద్యులు. ఇలాంటి సమస్యలు అతి తక్కువగా ఉంటాయి కనుక దీనిని బీఎంజె కేస్ రీపోర్ట్స్ మెడికల్ జర్నల్ లో ప్రచురించారు. అందులో ఫోటోలతో సహా పూర్తిగా తెలియజేశారు. పురుషాంగం ఫ్రాక్చర్ ను అలాగే వదిలేస్తే సమస్య మరింత జఠిలమవుతుందనీ, కొందరిలో అంగం స్తంభించకుండా పోతుందని వెల్లడించారు.