గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (19:30 IST)

కళ్ళెదుట నోరూరించే వంటలు... తక్కువగా ఆరగించాలంటే?

నోరూరించే వంటకాలు, ఆహార పదార్థాలను అతిగా ఆరగిస్తున్నారా? తద్వారా ఊబకాయులుగా తయారవుతున్నారా? దీనికి సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు ఒక చిట్కాను వెల్లడిస్తున్నారు.
 
కళ్ళముందు నోరూరించే ఆహార పదార్థాలు కనిపిస్తుంటాయి. వాటిని కడుపు నిండా ఆరగించకుండా ఉండాలంటే చిన్నపాటి చిట్కా పాటిస్తే మంచిదని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. అదేంటంటే... కంటి ముందు కనిపించే ఆహార పదార్థాలను రెండు మూడు నిమిషాల పాటు వాసన చూస్తే ఆపై ఆటోమేటిక్‌గా ఆ పదార్థాలను తక్కువగా ఆరగిస్తారట. 
 
ఈ మేరకు యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని మార్కెటింగ్ రీసెర్చ్ జర్నల్ తాజాగా ప్రచురించింది. మనం తినబోయే ఆహారపదార్థాలను రెండు నిమిషాల పాటు వాసన చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని, ఆ తర్వాత ఆహారం ఏదైనా తక్కువగా తీసుకుంటారని వారు చెపుతున్నారు.