గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By selvi
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:43 IST)

బరువు తగ్గాలా? కెలోరీలు ఖర్చు కావాలా? శృంగారంలో పాల్గొనండి..

బరువు తగ్గాలా? కెలోరీలు అదుపులో వుంచుకోవాలా? అయితే మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనండి అంటున్నారు.. అధ్యయనకారులు. శృంగారంతో కేలరీలు ఖర్చు అవుతాయని వారు చెప్తున్నారు. వ్యాయామానికి సమానంగా శృంగారం ద్వార

బరువు తగ్గాలా? కెలోరీలు అదుపులో వుంచుకోవాలా? అయితే మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనండి అంటున్నారు.. అధ్యయనకారులు. శృంగారంతో కేలరీలు ఖర్చు అవుతాయని వారు చెప్తున్నారు. వ్యాయామానికి సమానంగా శృంగారం ద్వారా కెలోరీలు ఖర్చు అవుతాయని వారు  చెప్తున్నారు.

ఎలాగంటే సుమారు అరగంట సేపు పరిగెత్తడంతో ఖర్చయ్యే కెలోరీలు శృంగారంలో పాల్గొనే భాగస్వామ్యుల్లో ఖర్చవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
శృంగారంలో పాల్గొంటే ముఖ్యంగా మహిళల కంటే పురుషుల్లో కేలరీలో అధికంగా ఖర్చు అవుతున్నాయని అధ్యయనకారులు తెలిపారు. నిజానికి శృంగారమనే కూడా ఒక రకమైన వ్యాయాయమేనని.. దీంతో కేలరీలు ఖర్చు కావడంతో పాటు మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. 
 
కండరాలు వదులు కావడంతో హాయిని కలిగించే రసాయనాలు శరీరానికి సరఫరా అవుతాయి. హాయిగా నిద్రకూడా పడుతుంది. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.