శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By సిహెచ్
Last Modified: గురువారం, 20 జూన్ 2019 (16:54 IST)

శృంగారంలో పాల్గొనే మహిళలకు పురుషుల నుంచి...

ఆహారంలో లోపాల వలన, సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం వలన మనం అనేక రోగాల బారిన పడుతుంటాం. వివాహం అయిన దంపతులు శృంగారం వల్ల కూడా కొన్ని రోగాల బాధ నుండి తప్పించుకోవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది. శృంగారం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని వారంటున్నారు. అయితే భాగస్వాములిద్దరూ ఎంతో ఇష్టంగా పాల్గోవాలట. అలా అయితేనే కొన్ని ఆరోగ్య  సమస్యల నుండి తప్పించుకోవచ్చట. అదెలాగో తెలుసుకుందాం.  
 
1. శృంగారంలో తరుచూ పాల్గొంటే ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనేవారు ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా చాలా సంతోషకరంగా ఉంటారని వెల్లడైంది.
 
2. తలనొప్పితో మరికొన్ని రకాల నొప్పులతో ఇబ్బందులుపడే వారు శృంగారంలో పాల్గొంటే వెంటనే ఉపశమం లభిస్తుంది. అలా పాల్గొంటే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. సాధారణ సమయంలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఇది విడుదల కావడం వల్ల నొప్పులు వెంటనే తగ్గుతాయి.
 
3. శృంగారంలో పాల్గొంటే డీహైడ్రోపియాండ్రోస్టోన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీంతో ఈ రోగనిరోధ శక్తి పెరుగుతుంది. కణజలాల్ని ఎప్పుటిప్పకప్పుడు ఈ హర్మోన్ మెరుగుపరుస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వారంలో కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారు ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు. 
 
4. శృంగారంలో పాల్గొంటే మహిళల్లో ఈస్ట్రోజెన్ హర్మోన్ విడుదలవుతుంది. ఇదివారు గుండె జబ్బు బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే శరీరం నుంచి దుర్వాసన రాకుండా చేస్తుంది. పురుషుల్లో విడుదలయ్యే టెస్టోస్టెరాన్ వారికి నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది.