రోజా రేకులతో వీర్యవృద్ధి

రోజూ రోజా రేకులను రోజూ గుప్పెడు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రోజా రేకులు శృంగార జీవితానికి మేలు చేస్తాయి. రక్తశుద్ధి జరుగుతుంది. అంతేకాకుండా రోజా పూవుల్లోని గుణాలు

selvi| Last Updated: శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (15:54 IST)
రోజూ రోజా రేకులను రోజూ గుప్పెడు తీసుకుంటే వీర్యవృద్ధి కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. రోజా రేకులు శృంగార జీవితానికి మేలు చేస్తాయి. రక్తశుద్ధి జరుగుతుంది. అంతేకాకుండా రోజా పూవుల్లోని గుణాలు చర్మానికి మేలు చేస్తాయి. ఇవి మొటిమలు, నల్లటి మచ్చలు మాయం చేస్తుంది.


రోజా రేకులను నీటిలో బాగా మరిగించాలి. తర్వాత వాటిని బయటకు తీసి ముద్దగా నూరి... దీనికి ముల్తానీ మట్టి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారంలో ఒక్కసారి మీ మొహంపై రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. 
 
అలాగే రోజా రేకుల కషాయం ఆరోగ్యానికి మంచిదే. నీరు, రోజా రేకులు మరిగించి రోజూ అర గ్లాసుడు తీసుకుంటే చర్మం మెరుపును సంతరించుకుంటుంది. రోజా రేకుల్లో వుండే పదార్థాలు నాజూకుతనానికి బాగా ఉపయోగపడతాయి. 
 
కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం లేదా రోజా రేకులతో కాచిన కషాయాన్ని తాగినట్లైతే సన్నబడుతారు. అంతేకాకుండా రోజా రేకులు జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా మీరు సన్నబడే అవకాశముందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :