శనివారం, 16 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:57 IST)

తీసుకునే ఆహారంలో పులుపు కచ్చితంగా ఉండాల్సిందేనా?

మనం తీసుకునే ఆహారంలో కాసింత పులుపు కూడా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చింత పండు, నిమ్మ‌, ఉసిరి, నారింజ పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పులుపు తీసుకోవడం ద్వారా నోటిలో లాలాజ

మనం తీసుకునే ఆహారంలో కాసింత పులుపు కూడా ఉండాల్సిందేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చింత పండు, నిమ్మ‌, ఉసిరి, నారింజ పండ్లను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పులుపు తీసుకోవడం ద్వారా నోటిలో లాలాజలం ఎక్కువగా ఊరుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే  పులుపు ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. మితంగా తీసుకోవాలి. 
 
అలా ఎక్కువగా తీసుకుంటే కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి. దృష్టి మందగిస్తుంది. శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది. కాళ్ళు, చేతులు నీరు పడతాయి. దాహం ఎక్కువ అవుతుంది. ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి. అయితే ఆమ్లా, నారింజ, బత్తాయి పండ్లను రోజుకొకటి చొప్పున తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.