శుక్రవారం, 25 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 4 జులై 2016 (19:55 IST)

పిల్లలు పుట్టాక మహిళల్లో పొట్ట వస్తుందా...? ఏం చేయాలి?

పిల్లలు పుట్టిన కొంతమంది మహిళల్లో పొట్ట వస్తుంది. ఈ పొట్ట తగ్గాలంటే... భోజనం తర్వాత నడవండి! అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం తర్వాత పొట్ట తగ్గలేదంటే ఆఫ్టర్ లంచ్ నడక కొనసాగించాల్సిందే. భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటా

పిల్లలు పుట్టిన కొంతమంది మహిళల్లో పొట్ట వస్తుంది. ఈ పొట్ట తగ్గాలంటే... భోజనం తర్వాత నడవండి! అంటున్నారు గైనకాలజిస్టులు. ప్రసవం తర్వాత పొట్ట తగ్గలేదంటే ఆఫ్టర్ లంచ్ నడక కొనసాగించాల్సిందే.  భోజనం చేసిన తర్వాత చాలా మంది కూర్చోవడమో లేదా పడుకోవడమో చేస్తుంటారు. 
 
మరి ప్రసవానంతరం కూడా ఇలాగే చేస్తే పొట్ట తగ్గడమేమో గానీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భోజనం తర్వాత దాదాపు పావుగంట అయినా అటూ ఇటూ నడవాలి. ఇది ఆరోగ్యానికి, పొట్టతగ్గడానికి రెండింటికీ మంచిది.
 
అలాగే కొంతమంది ఉదయం, సాయంత్రం...ఇలా రెండు పూటలకు సరిపడా వంట ఉదయమే చేసేస్తారు. కానీ అలా ఉదయం చేసిన పదార్థాలు సాయంత్రానికి చల్లగా అయిపోతాయి. వీటిని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. 
 
కాబట్టి ఏ పూటకు ఆ పూటే తాజాగా, వేడి వేడిగా వండుకొని తినడం వల్ల అటు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా... ఇటు పొట్ట ఎత్తు కూడా తగ్గుతుంది. అలా తాజా పండ్లు కూడా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతాయి.
 
ఇక కూరగాయల విషయంలో ఏ సీజన్‌లో దొరికే తాజా కూరగాయల్ని ఆ సీజన్‌లో తప్పనిసరిగా తినడం మంచిది. ఇలా చేస్తే పొట్ట తగ్గుతుంది. తినే ఆహారం మితంగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిదని, ఇంకా వ్యాయామం తప్పకుండా చేయాలని గైనకాలజిస్టులు అంటున్నారు.