ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (13:05 IST)

వ్యాయామానికి తర్వాత కోడిగుడ్లు, మొలకెత్తిన గింజలు తీసుకోకపోతే?

వ్యాయామం చేయడం ద్వారా ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే వ్యాయామం మొదలు పెట్టాక దానిని ఆపకూడదని.. క్రమంగా చేస్తూనే వుండాలని వైద్యులు చెప్తున్నారు. వ్యాయామం చేయడం ద్వారా కండరాల పనితీరు మ

వ్యాయామం చేయడం ద్వారా ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే వ్యాయామం మొదలు పెట్టాక దానిని ఆపకూడదని.. క్రమంగా చేస్తూనే వుండాలని వైద్యులు చెప్తున్నారు. వ్యాయామం చేయడం ద్వారా కండరాల పనితీరు మెరుగవడంతో పాటు అధిక బరువు పెరగడాన్ని నియంత్రించవచ్చునని.. అయితే అదే పనిగా వ్యాయామం చేస్తూ పోషకాహారం తీసుకోకపోతే మాత్రం శరీరంలోని శక్తి నశిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా లో ఎనర్జీ అవైలబిలిటీ అనేది తరచూ వ్యాయామం చేసే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందని ఓ పరిశోధనలో తేలింది. అందుకే వ్యాయామం ద్వారా భారీగా శక్తిని కోల్పోకుండా వుండాలంటే... ఫైబర్ ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
లేకుంటే నిస్సత్తువ, దీర్ఘకాలంలో రుతుక్రమంలో ఇబ్బందులు, ఎముకల బలహీనత, కొలెస్ట్రాల్‌లో మార్పులు ఏర్పడతాయి. అందుకే వ్యాయామం తర్వాత మాంసకృత్తులు అందించే కోడిగుడ్లు, మొలకెత్తిన గింజలు, తృణధాన్యాలు, పాలు, చికెన్, గోధుమలతో చేసిన వంటకాలు, బాదం, డ్రైఫ్రూట్స్, నట్స్ వంటివి తీసుకోవాలని న్యూట్రీషన్లు చెప్తున్నారు.