ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 5 జులై 2016 (12:51 IST)

ఎముకలు అరిగిపోకుండా ఉండాలంటే క్యాల్షియం మాత్రలకంటే తమలపాకులు...

హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తమలపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. భగవంతుని పూజలో కూడా తమలపాకులను వాడుతూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎ విటమిన్, సి విటమిన

హిందూ సంస్కృతిలో తాంబూలానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తమలపాకు ఆరోగ్యానికి చాలా మంచిది. భగవంతుని పూజలో కూడా తమలపాకులను వాడుతూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను పక్కన పెడితే తమలపాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎ విటమిన్, సి విటమిన్, కాల్షియం, పోలిక్ యాసిడ్ తమలపాకులో పుష్కలంగా ఉన్నాయి. 
 
ముఖ్యంగా తాంబూలంలో రోగనిరోధకశక్తిని పెంచే అద్భుతశక్తి ఉంది. తమలపాకులో వుండే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. జీర్ణవ్యవస్థకు తమలపాకు చాలా మేలు చేస్తుంది. అనేకరకాలైన విషాలను హరించగల ఔౌషధ గుణాలు తమలపాకులో ఉన్నాయి. చిన్న పిల్లలకు జలుబు చేసినప్పుడు తమలపాకు రసం ఒకటి రెండు చుక్కలు పాలతో రంగరించి ఇస్తే జలుబు, దగ్గు దూరమవుతాయి. 
 
తమలపాకుతో సున్నం కలిపి వేసుకుంటే శరీరంలో కాల్షియం సమపాళ్ళలో ఉండేలా చూస్తుంది.  మరియు ఎముకలు అరిగిపోకుండా చూస్తుంది. బాలెంతలు తాంబూలం వేసుకుంటే ఎంతో మంచిది. వక్క, తమలపాకు మరియు సున్నం రెండింటినీ అనుసంధానం చేసి శరీరంలో వేడి పెరగకుండా సమతుల్యం చేస్తుంది.