1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (23:07 IST)

జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే?

ఇలాంటి నొప్పులు ఉన్నవారు.. కీళ్ళ మీద ఆవనూనెను ప్రతిరోజూ రెండు పూటలా మర్దన చేసినట్టయితే కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుంది. అలాగే, సైంధవ లవణం ఒక స్పూను, దానిమ్మ చిగుళ్ళు కొంచెం కలిపి నూరి, చేసుకుని ఒక మాత్ర చొప్పున మూడు పూటలా తీసుకుంటే కీళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని నాటు వైద్యులు చెపుతున్నారు. 
 
అలాగే, ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి. నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా కాచి, చల్లార్చి ఆ నూనెను వడగట్టి కీళ్ళ నొప్పులున్న చోట మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
 
జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే కూడా నొప్పులు తగ్గిపోతాయి.