శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: బుధవారం, 10 జనవరి 2018 (20:59 IST)

దగ్గు వస్తుంటే పెరుగు తినకూడదా?

జలుబూ, దగ్గు సర్వసాదారణంగా వస్తుంటాయి. వీటి బారిన పడినప్పుడల్లా వైద్యుడి దగ్గరకు పరిగెత్తలేం కదా. అందుకే ఇంట్లో లభించే పధార్థాలతోనే ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. 1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానిని తప్పనిసరిగా త

జలుబూ, దగ్గు సర్వసాదారణంగా వస్తుంటాయి. వీటి బారిన పడినప్పుడల్లా వైద్యుడి దగ్గరకు పరిగెత్తలేం కదా. అందుకే ఇంట్లో లభించే పధార్థాలతోనే ఎలా తగ్గించుకోవాలో చూద్దాం.
 
1. జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు చాలామంది పెరుగు మానేస్తారు. కానీ దానిని తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులోని మేలు చేసే బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
 
2. గొంతులో ఇబ్బందిగా ఉన్నప్పుడు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కాస్తంత నిమ్మరసం కలిపి తాగాలి. వెంటనే ఉపశమనం లభిస్తుంది. తేనెను నేరుగా తీసుకున్న సాంత్వన లభిస్తుంది.
 
3. పైనాఫిల్ పండును తినడంవల్ల కూడా దగ్గు తగ్గుతుంది. ఈ పండులో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైము దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగించి గొంతు గరగరను తగ్గిస్తుంది.
 
4. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు చెంచా ఉప్పు వేసి బాగా కలపి ఆ నీటితో పుక్కిలించి ఉమ్మేయాలి. ఇలా చేసిన వెంటనే ఎంతో మార్పు కనిపిస్తుంది. దగ్గు, జలుబుతో బాధపడుతున్నప్పుడు ఎక్కువ నీటిని తాగాలి. అల్లం టీని తరచు తీసుకోవడం వల్ల కూడా గొంతుకు సాంత్వన లభిస్తుంది.
 
5. పుదీనా ఆకుల మాదిరిగా ఉండే పిప్పర్‌మెంట్ ఆకులు కూడా దగ్గుని తగ్గిస్తాయి. వేడి నీటిలో కొన్ని చుక్కల పిప్పరమెంట్  నూనె వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల కూడా దగ్గు తగ్గుతుంది.