ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (14:41 IST)

టీ, కాఫీ, ఆహారంలో దాల్చినచెక్క పొడిని చల్లుకుంటే?

కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం.. శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు మధుమేహానికి కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే.. మధుమేహాన్ని తగ్గిం

కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చోవడం.. శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలు మధుమేహానికి కారణమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే.. మధుమేహాన్ని తగ్గించుకోవచ్చు  లేదా నివారించవచ్చునని వారు సూచిస్తున్నారు. స్ట్రాబెర్రీలను రోజూ పావు కప్పు తీసుకుంటే మధుమేహం దరిచేరదు. స్ట్రాబెర్రీ చెడు కొలెస్ట్రాల్‌, కొవ్వులు త‌గ్గ‌ిస్తుంది. 
 
అలాగే ఫ్యాట్ లెస్ పెరుగును డైట్‌లో చేర్చుకోవడం ద్వారా శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది షుగ‌ర్ వ‌చ్చే అవ‌కాశాల‌ను త‌గ్గిస్తుంది. ఛీజ్‌లో కూడా ఇలాంటి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. పాలకూరలో ఆరోగ్యానికి మేలు చేసే పోష‌కాలు ఎక్కువగా వున్నాయి. ఇక దాల్చిన చెక్కలోని ట్రైగ్లిజ‌రైడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ని త‌గ్గించి ఇన్సులిన్‌ ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది. టీ కాఫీల్లోనో, ఆహారంలోనో కాస్త దాల్చిన చెక్క పొడిని చ‌ల్లుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.