శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 28 ఏప్రియల్ 2021 (18:31 IST)

తలనొప్పిగా వుందా? పొన్నగంటి వేరు రసాన్ని నుదుటికి రాస్తే...

పొన్నగంటి కూర వేరు రసాన్ని నుదుటకి పూస్తే తలనొప్పి తగ్గుతుంది. సీతాఫలం ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. 
 
కర్పూరాన్ని కొబ్బరినూనెతో కలిపి కీళ్ల నొప్పులు ఉన్నచోట రాస్తే చాలా త్వరితంగా సాంత్వన లభిస్తుంది. ఇంకా అడవి గోరింట కషాయాన్ని కొద్దికాలం పాటు తీసుకుంటే తీవ్రమైన కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయి. జీలకర్ర తైలంలో ఉప్పు కలిపి వంటికి రాసుకుంటే అన్ని రకాల వంటినొప్పులు తగ్గుతాయి. పత్తి గింజలను వేయించి పొట్టు తీసి తింటే పంటి నొప్పి, నరాల బలహీనత తగ్గుతాయి.
 
రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్చమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.
  
గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.