నిమ్మఆకుల్లో ఔషధ గుణాలు.. మైగ్రేన్ తలనొప్పి తగ్గాలంటే?
Lemon
నీళ్లను వేడిచేసి అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి. అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానబెట్టాలి. నిమ్మఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.
ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి. వీటిని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియాను నాశనమయ్యి.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. స్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా వీటిని హ్యాండ్ వాష్ లా కూడా వాడోచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాస్తే.. బాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
