1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (14:31 IST)

పప్పులే కదాని తేలికగా తీసిపారేయకండి...

పప్పుచారు, ముద్దపప్పు, ఆకుకూర పప్పు, గోంగూరపప్పు ఇలా చాలా రకాలుగా మనం పప్పు దినుసులను వంటకాలలో ఉపయోగిస్తున్నాం. ఇవి చాలా రుచిగా ఉండటమేకాక మంచి పోషణను కలిగి ఉంటాయి. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కూరగాయలు లేకున్నా పప్పుదినుసులతో కూరలు చేసుకోవచ్చు. మనకు కందిపప్పు, పెసరపప్పు, మినపపప్పు వంటి పలురకాల దినుసులు అందుబాటులో ఉన్నాయి. పప్పులే కదా అని తేలికగా తీసిపారేయకండి. వీటి వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 
 
ప్రతిరోజూ పప్పు దినుసులను ఆహారంలో భాగం చేసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. పప్పుల్లో అధిక మోతాదులో ఉండే ఫొలేట్, మెగ్నీషియం వంటి పోషకాలు గుండెను పదిలంగా ఉంచుతాయని అధ్యయనాలలో తేలింది. పప్పు దినుసులను తినడం వలన మధుమేహాన్ని కూడా నియంత్రణలో ఉంచవచ్చు. పప్పు దినుసుల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మలబద్దకంతో బాధపడేవారికి పప్పు దివ్యాఔషధం. డైయేరియా వచ్చిన వాళ్లు పప్పు తింటే త్వరగా నయం అవుతుంది. స్థూలకాయంతో బాధపడేవారు కూడా పప్పులను తినవచ్చు.