గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 18 నవంబరు 2017 (18:38 IST)

బెల్లం వేరుశెనగ కలిపి తింటే ఎంత ప్రయోజనమో తెలిస్తేనా...?

స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. చిన్నచిన్న పిల్లలు కూడా విపరీతమైన బరువు పెరిగిపోతున్నారు. కష్టపడి పెంచిన ఆ ఒళ్ళును తగ్గించలేక నానా బాధలు పడుతుంటారు. ఈ స్థూలకాయం వచ్చిందంటే చాలు మిగిలిన అనారోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి. అధికంగా ఉన్న బరువును తగ్గ

స్థూలకాయం అనేది పెద్ద సమస్యగా మారింది. చిన్నచిన్న పిల్లలు కూడా విపరీతమైన బరువు పెరిగిపోతున్నారు. కష్టపడి పెంచిన ఆ ఒళ్ళును తగ్గించలేక నానా బాధలు పడుతుంటారు. ఈ స్థూలకాయం వచ్చిందంటే చాలు మిగిలిన అనారోగ్య సమస్యలు వచ్చేస్తుంటాయి. అధికంగా ఉన్న బరువును తగ్గించుకోవడానికి చాలా చిట్కాలు ఉన్నాయి. తూచా తప్పకుండా వాటిని పాటిస్తే ఖచ్చితంగా బరువు తగ్గొచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.
 
స్థూలకాయం తగ్గాలంటే బెల్లం తినాలి. వేరుశెనగ, నువ్వులు బాగా తినాలి. కానీ నువ్వుల్లో నూనె ఉంటుంది కదా అని అనుకోవచ్చు. అయితే నువ్వులలో ఉండే నూనె మేలు చేసేదే. అది చెడు కొలెస్ట్రాల్ కాదు. హాని చేసే కొవ్వు వల్లే స్థూలకాయం వస్తుందని తెలుసుకోవాలి. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతూ స్థూలకాయం తగ్గుతూ ఉంటుంది. భోజనం చేసిన వెంటనే నువ్వులను బాగా నమిలి తినాలి. మూడు లేదా నాలుగు నెలలు ఇలా నువ్వులు తింటే చాలా మంచిది. ఇలా చేస్తే ఏడు కిలోల బరువు ఖచ్చితంగా తగ్గుతారు. వేసవి కాలంలో మాత్రం నువ్వులు తినకూడదు. ఎందుకంటే క్షార తత్వం వల్ల బరువు మరీ తగ్గిపోయే అవకాశం వుంటుంది.