ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2017 (11:51 IST)

బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసే దానిమ్మ...

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవాళ్లకి దానిమ్మ మేలు చేస్తుంది. దానిమ్మలో పీచు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండే దానిమ్మలో కొద్దిపాళ్ళలో కార్బొహైడ్రేడ్లూ ఉంటాయి. వీటిలోని పునికాలిజిన్స్‌, ప్యునిసిక్‌ ఆమ్లం అ

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవాళ్లకి దానిమ్మ మేలు చేస్తుంది. దానిమ్మలో పీచు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉండే దానిమ్మలో కొద్దిపాళ్ళలో కార్బొహైడ్రేడ్లూ ఉంటాయి. వీటిలోని పునికాలిజిన్స్‌, ప్యునిసిక్‌ ఆమ్లం అనే రెండు శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అనేక ఆరోగ్యసమస్యల్ని నివారిస్తాయి. 

దానిమ్మలోని రసాయనాలు వైరల్‌, బ్యాక్టీరియా, ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను సైతం ఎదుర్కొంటాయి. అందుకే తరచూ జలుబూ జ్వరాలతో బాధపడేవాళ్లకీ ఇది ఎంతో మేలు చేస్తుంది. అల్సర్ల నిరోధానికీ తోడ్పడుతుంది. శస్త్రచికిత్సల అనంతరం దానిమ్మరసాన్ని ఇవ్వడంవల్ల అది మతిమరుపు రాకుండా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
హృద్రోగాలూ, పక్షవాతం వంటి వ్యాధులకు మూలమైన బీపీని సైతం ఇది తగ్గిస్తుందట. ఆస్టియోఆర్థ్రయిటిస్‌, కీళ్లనొప్పులకు కారణమైన ఎంజైమ్‌ల విడుదలను అడ్డుకోవడం ద్వారా ఆయా వ్యాధుల నిరోధానికి దానిమ్మరసం తోడ్పడుతుంది. ముఖ్యంగా దానిమ్మరసం హృద్రోగుల రక్తనాళాల్లో కొవ్వుకణాలు పేరుకోకుండా నిరోధిస్తుంది.