గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:35 IST)

కుంకుమపువ్వు కలిపిన పాలను నుదిటిపై రాసుకుంటే..?

చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం లభించాలంటే.. కుంకుమపువ్వు తీసుకుంటే చాలంటున్నారు. ఈ రెండింటిని నయం చేసే గుణాలు కుంకుమపువ్వులో అధికంగా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. మరి ఈ పువ్వును తీసుకోవడం వలన కలిగే మరికొన్ని ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. చిన్న పిల్లలు, పెద్దలు గ్లాస్ పాలలో ప్రతిరోజూ కుంకుమపువ్వు కలిపి తాగితే మెదడు పనీతీరు చురుగ్గా ఉంటుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఎంతో కృషి చేస్తుంది. వయసు పైబడిన వారిలో వచ్చే మతిమరుపును తగ్గిస్తుంది. 
 
2. నిద్రలేమి సమస్యతో భాదపడేవారు... తరచు కుంకుమపువ్వు తింటే.. సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియన్స్, విటమిన్, మాంగనీస్ వంటి ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చేలా చేస్తాయి. 
 
3. పావుకప్పు పాలలో కొద్దిగా కుంకుపువ్వు కలిపి కాసేపు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నుదుటిపై రాసుకుంటే.. జలుబు కారణంగా వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. ఈ పువ్వును తరచు తినడం వలన శరీరంలోని వేడి కూడా తగ్గుముఖం పడుతుంది.
 
4. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. స్త్రీలకు రుతు సమయంలో కడుపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పువ్వు కలిపిన పాలు తాగితే చాలు తక్షణమే ఉపశమనం లభిస్తుంది.