గురువారం, 5 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (14:08 IST)

ఎండాకాలంలో తాజా పండ్ల రసాలను తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

ఎండాకాలంలో తాజా పండ్లరసాలను అధికంగా తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్‌, దానిమ్మ జ్యూస్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి. క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ ఎ పుష్కలం

ఎండాకాలంలో తాజా పండ్లరసాలను అధికంగా తీసుకోవాలి. క్యారెట్ జ్యూస్‌, దానిమ్మ జ్యూస్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి. క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది. ఆరెంజ్‌ జ్యూస్‌లో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. 
 
ఇదేవిధంగా కుకుంబర్‌ జ్యూస్‌ స్కిన్‌ పిగ్మెంటేషన్‌ తగ్గిస్తుంది. దాంతో చర్మంలో ఎలాంటి స్కార్స్, మార్క్స్ కనబడవు. ఇందులో వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను ఎఫెక్టివ్‌ గా తొలగిస్తుంది. కిడ్నీలను శుభ్రపరిచి అధికంగా ఉండే రక్తపీడనాన్ని తగ్గిస్తుంది. కీళ్ళ వ్యాధులను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. దానిమ్మ జ్యూస్ కొత్తగా చర్మ కణాలు ఏర్పడుటకు కూడా సహాయపడుతుంది.
 
దానిమ్మ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తాగడం వల్ల గ్లోయింగ్‌ స్కిన్‌ పొందవచ్చు. ఇది అన్ని రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. ద్రాక్ష జ్యూస్‌ను తీసుకోవడం ద్వారా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే చర్మంలో రక్రప్రసరణ మెరుగవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.