బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 23 జనవరి 2019 (14:56 IST)

దంతాలు రంగు ఎందుకు మారుతాయో తెలుసా..?

కొందురు ఎన్నిసార్లు తోమినా కూడా దంతాలు మాత్రం రంగు మారుతుంటాయి. పచ్చగా తయారవుతాయి. మాట్లాడేటప్పుడు ఎదుటి వారిలో పలచన భావన కనిపించే అవకాశం ఉంది. ఇందుకు మనం తీసుకునే నీరు, ఆహారమే ఈ సమస్యకు ప్రధాన కారణాలవుతాయి. 
 
తిన్న ఆహార పదార్థాలు దంతాలపై నిల్వ ఉంటే అవి రంగు మారే అవకాశం ఉంది. చాలా తీపి పదార్థాలు తీసుకోవడం వలన కూడా దంతాలు పాడవుతాయి. పిప్పి పళ్ళు, సిగరెట్లు, బీడీలు, పొగాకు, చుట్టలు కాల్చుట మొదలైనవి నమలడం వలన కూడా దంతాలకు హానికరమే. దంతాలు, చిగుళ్ళకు ఇన్‌ఫెక్షన్ వస్తుంది. 
 
దంతాలు విరిగిపోతాయి. దవడ ఎముకలు విరిగి పోతుంది. విటమిను సి, విటమిను డి లోపిస్తే శరీరంలో క్యాల్షియం శాతం తగ్గిపోయినా దంతాలు రంగు మారిపోతాయి. త్రాగు నీటిలో ప్లోరిన్ శాతం అధికంగా ఉంటే ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు..
 
ప్రతి రోజు ఉదయం, రాత్రి నిద్ర పోవుటకు ముందు దంతాలను శుభ్రపరుచుకోవాలి. భోజనం చేసిన ప్రతి సారి స్వచ్చమైన నీటితో శుభ్రపరచాలి. మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడాలి. తరచూ దంత వైద్యుని చే పరీక్ష చేయించుకొని ఆయన సలహా మేరకూ నడుచుకోవాలి. చిన్నపిల్లలు చాక్లెట్లు తీపి పదార్థాలు తినిన వెంటనే నీటితో దంతాలు శుభ్రపరచాలి.