శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: గురువారం, 26 అక్టోబరు 2017 (22:21 IST)

పులిపిర్లను పోగొట్టుకోవడం చాలా ఈజీ...

పులిపిర్లు అనేవి చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలో 10 నుంచి 12 మందికి చర్మంపైన పులిపిర్లు వస్తుంటాయి. పులిపిర్లు ఏర్పడడానికి హెచ్‌పిబి వైరస్ కారణం. ఈ వైరస్‌లో 80 ఉపతరగతులు ఉంటాయి. వీటిలో చాలా అరుదుగా కొన్ని క్యాన్సర్‌కు దారి తీసేదిగా కూడా

పులిపిర్లు అనేవి చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలో 10 నుంచి 12 మందికి చర్మంపైన పులిపిర్లు వస్తుంటాయి. పులిపిర్లు ఏర్పడడానికి హెచ్‌పిబి వైరస్ కారణం. ఈ వైరస్‌లో 80 ఉపతరగతులు ఉంటాయి. వీటిలో చాలా అరుదుగా కొన్ని క్యాన్సర్‌కు దారి తీసేదిగా కూడా ఉంటాయి. హెచ్‌పిబి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తరువాత శరీర కణజాలంలో కొన్ని మార్పులు జరిగి చర్మంపై భాగాన, కింది భాగాన గట్టి ప్రొటీన్ ఏర్పడుతుంది. ఇది చర్మం మీద ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. దీన్నే మనం పులిపిరి అంటాం.
 
పులిపిర్ల వల్ల నొప్పి ఉండదు. కొన్ని పులిపిర్లు వంశపారపర్యంగా కూడా సంక్రమిస్తాయి. వాటిలో కొన్ని వాటంతట అవే కనిపించకుండా పోతాయి. వెల్లుల్లి రెక్కలను పులిపిర్లపై రుద్దితే తగ్గుతాయి. ఇలా రెండుమూడు వారాల పాటు చేయాలి. అలాగే ఒక డ్రాప్ ఆముదాన్ని పులిపిర్లపై వేసి స్టిక్కర్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలు, మూడు వారాల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కొత్త సున్నం బాగా పనిచేస్తుంది. సున్నం పక్కన చర్మానికి పడకుండా చూసుకోవాలి.