నిమ్మరసంతో ఆస్త్మా తగ్గుతుందా...?
నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలోని సి విటమిన్ కాస్త ఎక్కువ మోతాదులోనూ, ఖనిజ లవణములు తక్కువ మోతాదులో, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి, మాంసకృత్తులు వుంటాయి.
నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. రోజూ నిమ్మరసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలోని సి విటమిన్ కాస్త ఎక్కువ మోతాదులోనూ, ఖనిజ లవణములు తక్కువ మోతాదులో, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ బి, మాంసకృత్తులు వుంటాయి. నిమ్మకాయను ఎక్కువగా ఉపయోగించేవారు ఎక్కువగా ఉత్సాహవంతంగా వుంటారు.
నిమ్మలోని ఔషధ గుణాలు :
* నిమ్మరసం, బార్లీ జావ కలుపుకుని రోజూ మూడు పూటలా, వారం రోజులు తాగితే జలుబు మాయమవుతుంది.
* నిమ్మరసంలో సైంధవ లవణం కలిపి రోజూ తాగుతుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
* గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ అల్లపు రసం, నిమ్మచెక్క సగభాగం రసం, రెండు స్పూన్లు తేనె కలిపి తాగితే, అయిదారు నెలల్లో ఆస్త్మా తగ్గిపోతుంది.
* నిమ్మరసంలో కొంచెం ఉప్పు, అల్లం రసం కలిపి తాగితే గుండెలో మంట, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.