మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: గురువారం, 8 మార్చి 2018 (15:03 IST)

పురుషులలో వీర్యకణాలు లేకపోతే ఇలా చేస్తే సరి...

చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యలో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషుల వీర్యంలో సంతాన సాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులు కన్నా కూడా మనం తీసుకునే ఆహారంలో వీర్య కణాలు పెంపొందించే ఆహ

చాలామంది దంపతులు ఎదుర్కొనే సమస్య సంతానలేమి. ఈ సమస్యలో చాలామంది మానసికంగా కృంగిపోతున్నారు. అయితే ఈ సమస్యలో ఎక్కువ శాతం పురుషుల వీర్యంలో సంతాన సాఫల్యం కోసం తగినన్ని వీర్యకణాలు లేకపోవడమే. మందులు కన్నా కూడా మనం తీసుకునే ఆహారంలో వీర్య కణాలు పెంపొందించే ఆహారం తీసుకోవడం చాలా మంచిది. నల్ల శనగలు బహుముఖ పోషక పధార్థం. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల వీర్యకణాల లోపాన్ని సులభంగా దూరం చేసుకోవచ్చు. ఇవి పురుషులలో వీర్యకణాల సమస్యను దూరం చేసే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉన్నాయి.
 
1. గుప్పెడు శనగలు, నాలుగు బాదం పప్పులను రాత్రిపూట నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని పరగడుపున బాగా నమిలి తినాలి. ఇలా కొన్ని రోజులు చేస్తుండటం వల్ల పురుషులలో వీర్యకణాలు పెరిగే అవకాశం ఉంది.
 
2. రాత్రిపూట ఒక కప్పు శనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ శనగలలో బెల్లం కలిపి తినడం వల్ల మగవారిలో శృంగార సామర్థ్యం పెరగడంతో బాటు వీర్యకణాల వృద్ధి కూడా పెరుగుతుంది. 
 
3. గుప్పెడు శనగలను ఉడకపెట్టి వాటిని స్వచ్ఛమైన నేతిలో వేయించి ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. తరువాత గోరువెచ్చని పాలు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవడమే కాకుండా వీర్యకణాల సంఖ్య కూడా మెరుగుపడుతుంది.