ఇలా చేస్తే అసిడిటీ దూరం..
మానవ జీవితంలో పెరిగిన వేగం కారణంగా కలుగుతున్న ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక పోవడం, ఎంతమాత్రం శారీరక శ్రమలేని జీవనశైలి వంటి అనేక కారణాలతో వచ్చే జీర్ణక్రియ సమస్యల్లో అసిడిటీ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యన
మానవ జీవితంలో పెరిగిన వేగం కారణంగా కలుగుతున్న ఒత్తిడి, ఆహార నియమాలు పాటించక పోవడం, ఎంతమాత్రం శారీరక శ్రమలేని జీవనశైలి వంటి అనేక కారణాలతో వచ్చే జీర్ణక్రియ సమస్యల్లో అసిడిటీ ఒకటి. ఇటీవలి కాలంలో ఈ సమస్యను చాలా మంది వేధిస్తోంది. ఛాతిలో మంట, పుల్లటి తేన్పులు, గొంతులో ఏదో అడ్డంపడినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే ఇది అసిడిటీ అని భావించాల్సిందే. అయితే, దీనినుంచి దూరంగా ఉండాలంటే ఇలా చేస్తే
సరిపోతుంది.
* రాత్రి పడుకునే ముందు, నిద్ర నుంచి లేచిన వెంటనే గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి.
* రోజూ అరటిపండు తీసుకోవాలి.
* చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి. లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.
* రాత్రి గ్లాసు నీళ్ళకు చెంసా సోంపు కలిసి వేడిచేసుకుని ఉదయాన్ని చెంచా తేనెతో కలిసి తీసుకుంటే చాలు.
అసిడిటీ రావడానికి కారణాలు ఏమిటి అని చూస్తే...
* సరిగా నిద్ర లేకపోవడం.
* ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం.
* ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం.
* ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం.
* అధిక బరువును కలిగివుండటం.
* సమయానికి భోజనం చేయకపోవడం వంటివి ప్రధాన కారణాలు.