విటమిన్-డి లోపం రాకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

మనీల| Last Modified శనివారం, 5 అక్టోబరు 2019 (11:33 IST)
విటమిన్-డి అనేడి కొవ్వులో కరిగే విటమిన్. ఇది కాలేయంలో నిల్వ ఉంటుంది. మొదటగా కాలేయంలో తయారై అక్కడి నుంచి కిడ్నీలో మనకు ఉపయోగపడే విధంగా మారుతుంది. దీనినే కాల్సిట్రియోల్ అంటారు. ఇది యాక్టివ్ విటమిన్-డి. వయసు పెరిగే కొద్ది విటమిన్-డి లోపం అధికమవుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు :
*18 శాతం శరీరం 45 నిమిషాల పాటు ఎండకు ఎక్స్‌‌‌పోజ్ అయితే మనకు కాలాల్సినంత విటమిన్-డి లభించినట్టే. ఈ విటమిన్‌‌ను సూర్యకాంతిని గ్రహించి శరీరమే తయారుచేసుకోగలదు.

*గుడ్డు పసుపు సొనలో విటమిన్-డి ఉంటుంది. కొందరు ఎగ్ వైట్ మాత్రమే తీసుకుంటారు. అలాకాకుండా పసుపు సొనను కూడా తీసుకోవడం మంచిది.

*నట్స్, ఆయిల్ సీడ్స్‌‌లో కూడా విటమిన్-డి లభిస్తుంది. వీటిని డైలీ డైట్‌‌లో తీసుకోవటం మంచిది.

*వారానికి కనీసం రెండుసార్లు సాల్మన్, సార్డనైస్, హెర్రింగ్ వంటి చేపలు తీసుకుంటే మంచిది. వైట్ ఫ్యాటీ ఫిష్ తీసుకోవడం మంచిది.

*విటమిన్-డి ఉన్న సెరెల్ బ్రేక్‌‌ఫాస్టులు, పాలు, పెరుగు, ఆయిల్స్ మార్కెట్లో ప్రత్యేకంగా లభిస్తాయి. వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.

*పుట్టగొడుగుల్లో కూడా విటమిన్-డి ఉంటుంది. వీటిని కొంత సమయం ఎండబెట్టడం వల్ల కూడా విటమిన్-డి పెరుగుతుంది. పుట్టగొడుగులను ఇతర
కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు.
దీనిపై మరింత చదవండి :