గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ttdj
Last Updated : సోమవారం, 14 నవంబరు 2016 (14:26 IST)

నీటి వల్ల ప్రయోజనాలెన్నో.. ప్రతిరోజు కనీసం 3 లీటర్లు తాగాలి...

మానవునికి ప్రాణాధారమైనది నీరు. నిత్యజీవితంలో నీటి ఉపయోగం అత్యంత ప్రధానమైనది. శరీరం లోపల కూడా ఈ నీటితో అనేకమైన ప్రయోజనాలున్నాయి. నీరు ఆహార రసం శరీరంలో కలవటానికి ఉపయోగపడుతుంది. రక్తాన్ని ద్రవరూపంలో ఉంచు

మానవునికి ప్రాణాధారమైనది నీరు. నిత్యజీవితంలో నీటి ఉపయోగం అత్యంత ప్రధానమైనది. శరీరం లోపల కూడా ఈ నీటితో అనేకమైన ప్రయోజనాలున్నాయి. నీరు ఆహార రసం శరీరంలో కలవటానికి ఉపయోగపడుతుంది. రక్తాన్ని ద్రవరూపంలో ఉంచుతుంది. శరీరపు ఉష్ణోగ్రతను కాపాడుతుంది. మూత్రం ద్వారా చెడు పదార్థాలను వెలుపలకు పంపుతుంది. ఆహారం నమిలేటప్పుడు రసాలను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని చెడు పదార్థములను, మూత్రం ద్వారా, చెమట ద్వారా బయటకు పంపుతుంది. ప్రతి మనుషి ఆరోగ్యంగా జీవించుటకు ప్రతిరోజు సుమారు 3 లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆ నీటిలో సగం మూత్రం ద్వారా బయటకు పంపబడుతుంది.
 
ఆహారం తినే సమయంలో కొద్ది కొద్దిగా నీరు త్రాగి భోజనం తర్వాత మరింత నీరు త్రాగితే తిన్న ఆహారము వెంటనే జీర్ణమవుతుంది. ప్రతిరోజూ ఉదయం ముఖం కడిగిన వెంటనే ఒక గ్లాసు మంచినీరు త్రాగుతుంటే, మలబద్దకం సమస్య తగ్గిపోవటమేకాక జీర్ణకోశపు వ్యాధులు రాకుండా ఉంటాయి. 
 
శరీరంలో వేడి ఎక్కువై జ్వరంగా ఉన్నప్పుడు చల్ల నీటిలో గుడ్డ తడిపి శరీరం తుడుస్తుంటే ఆ వేడి తగ్గుతుంది. జ్వరంలో వచ్చే ఫిట్స్ కూడా తగ్గుతాయి. ఎండాకాలం నీటితో తడిపిన గుడ్డకు తలపై కట్టు కుంటుంటే వడదెబ్బ నుంచి రక్షణ జరుగుతుంది.
 
తొట్టినీటిలో ఒక చెంచా పప్పు వేసి 15-20 రోజులు ఉదయం పూట తొట్టి స్నానం చేస్తుంటే హిస్టీరియా వ్యాధి తగ్గుముఖం పడుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్ర పట్టని వారికి బాగా నిద్రపడుతుంది. గుండె జబ్బులున్న వారు చన్నీటి స్నానం చేయరాదు. ఉదయం పూట నులివెచ్చని వేడినీటితో స్నానం చేస్తుంటే నిద్రమత్తు, బడలిక, అలసట తగ్గిపోతాయి. ఎక్కువ వేడిగల నీరు వృషణాలకు తగిలితే ఇంద్రియ జీవకణాలు నశించి సంతానహీనులవుతారు. వృషణాలను చన్నీటితో శుభ్రపరుచుకుంటుండాలి.
 
శరీర శ్రమ చేసేవారు వేడినీటితో స్నానం చేస్తే ఒడలిక తగ్గి హాయిగా నిద్రపడుతుంది. వేడి నీటితో కాపడం పెడితే బహిష్టు నొప్పులు తగ్గుతాయి. వేడి నీటి తొట్టిస్నానం బహిష్టు నొప్పి, కంటి వాపు మూర్ఛ, మూత్ర బంధనములను తగ్గిస్తుంది. చిరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి త్రాగుతుంటే దగ్గు, ఆయాసం, కళ్ళు తిరుగుట తగ్గిపోతాయి. వేడి నీటిలో కొంచెం తప్పు కలిపి పుక్కలిస్తుంటే గొంతు నొప్పి తగ్గి కంఠము శుభ్రపడుతుంది. కొంచెం నులివెచ్చని నీరు త్రాగుతుంటూ కడుపు ఉబ్బరం పోయి ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.