గురువారం, 30 నవంబరు 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 30 ఏప్రియల్ 2018 (18:35 IST)

మానసిక ఒత్తిడిని తగ్గించే ఆహారం ఏమిటో తెలుసా?

ప్రస్తుత పరిస్ధితుల్లో జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. ఇప్పుడున్న సమస్యలు శరీరంపై, మెదడుపై ఎంతో ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఓపికను పరీక్షించే ట్రాఫిక్, ఆరోగ్యంతో ఆడుకునే కాలుష్యం, ఆఫీస్‌లో డెడ్‌లైన్‌లు ఇలా ప్రతిదీ మన ఒత్తిడిని పెంచేసేవే. కొన్ని రకా

ప్రస్తుత పరిస్ధితుల్లో జీవితం ఉరుకుల పరుగులమయంగా మారింది. ఇప్పుడున్న సమస్యలు శరీరంపై, మెదడుపై ఎంతో ఒత్తిడిని కలిగిస్తున్నాయి. ఓపికను పరీక్షించే ట్రాఫిక్, ఆరోగ్యంతో ఆడుకునే కాలుష్యం, ఆఫీస్‌లో డెడ్‌లైన్‌లు ఇలా ప్రతిదీ మన ఒత్తిడిని పెంచేసేవే. కొన్ని రకాల పదార్థాలను రోజువారి ఆహారంలో తీసుకోవటం వల్ల ఈ ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. అవి ఏమిటంటే...
 
1. కమలాపండు.... ఇది విటమిన్ సికి కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఇందులో ఎక్కువ మెుత్తంలో ఆ పోషకం ఉంటుంది. ఇది కూడా అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. దాంతో పాటు కార్టిసోల్ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ ఉదయం పూట ఒక్క పండు తినటం వలన మంచి ఫలితం ఉంటుంది. 
 
2. బాదం... వీటిలో బి2 ఉంటుంది. ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడి, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. 
 
3. పాలు...వీటిలో యాంటీ ఆక్సిడెంట్లూ, బి2, బి12 విటమిన్లు, మాంసకృత్తులూ, క్యాల్షియం ఎక్కువ మెుత్తంలో ఉంటాయి. పాలలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. కనుక ప్రతిరోజూ గ్లాసుడు పాలు తప్పనిసరిగా త్రాగటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది.
 
4. చేపలు... వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి వారంలో రెండుసార్లు చేపలను తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.