మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 22 ఏప్రియల్ 2020 (23:10 IST)

ఎండాకాలంలో ఎలాంటి పదార్థాలు తినాలి? ఎలా తినాలి?

1. ఆహారపదార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3. ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4. కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7. కాఫీ, టీ లకు వీలైనంత దూరంగా ఉండాలి.
8. కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9. సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10. పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.