బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (14:11 IST)

వడదెబ్బ : ఉల్లిపాయ ముక్కల్ని.. జీలకర్ర, తేనెతో కలిపి తీసుకుంటే?

ఎండాకాలంలో వడదెబ్బను నివారించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. మజ్జిగ ఎండాకాలంలో వడదెబ్బకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మజ్జిగలో ప్రొబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి.

ఎండాకాలంలో వడదెబ్బను నివారించాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే. మజ్జిగ ఎండాకాలంలో వడదెబ్బకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మజ్జిగలో ప్రొబయోటిక్స్‌ ఉంటాయి. ఇవి శరీరంలో విటమిన్స్, మినరల్స్ అందిస్తాయి. తరచుగా మజ్జిగ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే కొబ్బరినీళ్లు చక్కటి పరిష్కారం. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తగ్గించి.. ఎలక్ట్రోలైట్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
 
అలాగే కొత్తిమీరతో గానీ, పుదీనా ఆకులతో గానీ జ్యూస్‌ తయారుచేసుకుని కొంచెం చక్కెర కలుపుకుని తాగడం వల్ల వడదెబ్బ నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. ఇది శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది. సోంపు గింజలు శరీరంలో ఉష్ణోగ్రతని వేగంగా తగ్గిస్తాయి. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. కాబట్టి గుప్పెడు సోంపు గింజలు తీసుకుని, రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటిని తాగితే ఫలితం ఉంటుంది.
 
ఇకపోతే.. వడదెబ్బను నివారించుకోవాలంటే.. ఆనియన్‌ జ్యూస్‌ని చెవుల వెనుక భాగం, ఛాతీ పైనా రాయడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. లేదా కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేయించి, జీలకర్ర, తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా వడదెబ్బను నివారించుకోవచ్చు.