తోటకూరను వేళ్ళతో తీసుకుని దంచి తింటే...?
ఆకుకూరల పేరు చెప్పాలంటే ముందుగా తోటకూరను చెపుతారు. తోటకూరను పెరుగుకూర - పెరుగు తోటకూర అనికూడా అంటారు. ఆరోగ్యానికి తోటకూరను మించిన కూర లేదంటే అతిశయోక్తి కాదు. తోటకూర బలవర్థకమైన టానిక్ దీనిలో అనేక ఖనిజ లవణాలు వుంటాయి. అయితే దీనిని వండే విధానం సరిగ్గా త
ఆకుకూరల పేరు చెప్పాలంటే ముందుగా తోటకూరను చెపుతారు. తోటకూరను పెరుగుకూర - పెరుగు తోటకూర అనికూడా అంటారు. ఆరోగ్యానికి తోటకూరను మించిన కూర లేదంటే అతిశయోక్తి కాదు. తోటకూర బలవర్థకమైన టానిక్ దీనిలో అనేక ఖనిజ లవణాలు వుంటాయి. అయితే దీనిని వండే విధానం సరిగ్గా తెలియకపోతే తోటకూర ఎంత తిన్నా తోటకూర కాడ లాగే వుండాల్సిందే. తోటకూర ఆకుల్ని తరిగిన తరువాత కడగకూడదు. కాబట్టి తరిగే ముందు ఆకుల్ని బాగా కడిగి ఆ తరువాత తరిగి నూళ్ళు పోసి ఉడకబెట్టాలి.
వీలయితే కుక్కర్ వాడటం మంచిది. కుక్కర్‌లో ఉడక పెట్టడం వలన పోషక పదార్థాలు నష్టం కాకుండా వుండటమే కాక తేలికగా జీర్ణం అవుతుంది. తోటకూరను వేళ్ళతో సహా వున్నది తీసుకుని వేళ్ళ దగ్గరి మట్టిని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి మెత్తగా మొత్తం దంచి, పిండి రసం తీయాలి. ఆ తరువాత ఈ రసంలో తగినంత ఉప్పు, రసం పొడి కలిపి బాగా మరిగించి తాలింపు వేసుకుని అన్నంలో కలుపుకొని తినడమో లేక నేరుగా గ్లాసులో పోసుకుని త్రాగడమో చేస్తే తీవ్రమైన మొలలు తగ్గిపోతాయి.
అంతేకాదు కడుపులో పురుగులు కూడా ఈ రసం తాగితే పడిపోతాయి. బహిష్ట సమయంలో అధిక రక్తస్రావం అయ్యే స్త్రీలు చాలా నీరసపడి పోతారు. తోటకూరను టి.బి, టైఫాయిడ్, మలేరియా లాంటి వ్యాధులున్న వారు తగ్గిన తరువాత తరుచుగా తోటకూర తీసుకోవడం వలన నీరసం తగ్గుతుంది. తోటకూరలో ముఖ్యమైల ఖనిజం ఐరన్ వుంటుంది. రక్తం వృద్ధి చెందడానికి పనికి వస్తుంది. ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి మంచిది.