బుధవారం, 13 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 12 అక్టోబరు 2021 (21:49 IST)

వేడి నీటిలో పసుపు వేసుకుని ఆవిరి పడితే...

జలుబు అంటుకోగానే ఒకటే ఒళ్లు నొప్పులు, గొంతు, తలనొప్పి, జలుబు, జ్వరం... ఈ లక్షణాలన్నీ ఒకేసారి కనిపిస్తాయి. కొందరికి ఒకటే తుమ్ములు, మరికొందరికి దగ్గు కనిపిస్తుంది. పెద్దవాళ్లయితే ఏదో విధంగా తట్టుకుంటారు కాని పిల్లలు నీరసించిపోతారు. ఒకరి నుంచి ఒకరికి వెంటనే వ్యాపించే ఈ జలుబు, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలకు కొన్ని నివారణ సూచనలు.
 
జలుబు, జ్వరం లక్షణాలు కనిపించగానే ఎక్కువ హానికరం కాని పారాసిటమాల్ టాబ్లెట్‌లు వాడవచ్చు. జ్వరం దారికి వచ్చాక వాటి అవసరం కూడా ఉండదు. జలుబు పూర్తిగా దారికి వచ్చే వరకు రోజుకు మూడుసార్లు వేడి నీళ్లలో ఉప్పు వేసుకొని పుక్కిలించడం మరచిపోవద్దు.
 
రోజుకు రెండు సార్లు విక్స్ లేదా పసుపు వేసుకొని ఆవిరి పడితే జలుబు త్వరగా తగ్గడంతో పాటు గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ సీజన్‌లో నీళ్ల నుంచి అనేక జబ్బులు వ్యాపిస్తాయి. కాబట్టి పిల్లలు, పెద్దలు అందరూ దాకా కాచి, వడపోసిన నీళ్లు మాత్రమే తాగాలి. జలుబు, జ్వరం తగ్గేవరకు పండ్లు, పండ్ల రసాలకు దూరంగా ఉండండి.
 
నిమ్మపండు ఈ సీజన్‌లో వచ్చే జలుబు లక్షణాలను త్వరగా తగ్గిస్తుంది. వేడి నీళ్లలో నిమ్మరసం, కాస్త తేనె కలుపుకొని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జబ్బు నుంచి త్వరగా ఉపసమనం పొందుతారు. 
 
మిరియాలు, వెల్లుల్లి, అల్లం.. ఇవన్నీ కూడా ముక్కు దిబ్బడను తగ్గించడంతో పాటు, జలుబు చేసిన సమయంలో రిలీఫ్‌గా ఉండేందుకు తోడ్పడతాయి. మన ఇంట్లో దొరికే వస్తువులతో మొదట జలుబు, దగ్గు నివారణ పొందె ప్రయత్నం చేసుకోవాలి.