వాకింగ్ చేసిన తర్వాత కూరగాయల శాండ్‌విచ్ తీసుకుంటే?
బరువు తగ్గాలని వ్యాయామం చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. బరువు తగ్గడానికి వాకింగ్ చేసినా.. శరీరంలో వేగంగా కెలొరీలు ఖర్చవుతాయి. శక్తీ తగ్గుతుంది. అందుకే వ్యాయామం చేశాక కొన్
బరువు తగ్గాలని వ్యాయామం చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ టిప్స్ పాటించండి. బరువు తగ్గడానికి వాకింగ్ చేసినా.. శరీరంలో వేగంగా కెలొరీలు ఖర్చవుతాయి. శక్తీ తగ్గుతుంది. అందుకే వ్యాయామం చేశాక కొన్ని పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికెంతో మంచిది. అరటి పండును వ్యాయామం చేసిన తర్వాత తీసుకోవడం మంచిది.
శరీరం అలసిపోయినప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. అరటిలో ఆరోగ్యమైన కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. దీన్ని ప్రత్యక్షంగా కాకుండా.. వెన్నతీసిన పాలతో కలిపి స్మూతీలా చేసుకొని అందులో కాస్త నిమ్మరసం పిండి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఇక నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. వీటిలో కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ.
అలాగే ఉదయం పూట కాయగూరల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. వ్యాయామం అనంతరం కాయగూరల శాండ్‌విచ్‌లు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.