శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By TJ
Last Modified: మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:02 IST)

ఇవి తింటే దోమలు జన్మలో మిమ్మల్ని కుట్టవట...

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి మదిలోను ఉండే ఆలోచన. దోమలు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా దోమలు స్వైర విహారం చేస్తూ కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలు పోగొట్టాలని మస్కిటో కాయిల్స్ వాడుతూ చివరకు వాటిని మ

దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి. ఇది ప్రతి ఒక్కరి మదిలోను ఉండే ఆలోచన. దోమలు మామూలుగా వర్షాకాలంలో ఉంటాయి. కానీ ఎండాకాలంలో కూడా దోమలు స్వైర విహారం చేస్తూ కుట్టి రక్తాన్ని పీల్చేస్తున్నాయి. దోమలు పోగొట్టాలని మస్కిటో కాయిల్స్ వాడుతూ చివరకు వాటిని మనం పీల్చి లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నాం. కానీ ఇంత పని చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఆహార పదార్థాలను మనం తింటే అస్సలు దోమలు మనల్ని కుట్టవు.
 
వెల్లుల్లి, ఉల్లిపాయల్లో దోమల్ని తరిమేసే గుణాలున్నాయి. వీటిని పచ్చిగా తింటే మన శరీరంలోకి అలిసిన్ అనే సమ్మేళనం విడుదలవుతుంది. అందువల్ల దోమలు మన దగ్గర రావు. అంతేకాదు ఆపిల్ పైడర్ వెనిగర్‌ను పడుకోవడానికి 30 నిమిషాల ముందు తీసుకుంటే కూడా దోమలు మన దగ్గరకు రావు. ఇంకా కారం ఎక్కువగా తినేవారిని కూడా దోమలు కుట్టవట. ఉల్లికాడలు కూడా తినాలి. ఇవి కనుక తు.చ తప్పకుండా తింటే దోమలు అస్సలు మీ దగ్గరకు రావట.