శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (13:35 IST)

ఎప్పుడూ వంగినట్లు.. ఏదో భయంతో చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారా?

ఎప్పుడూ వంగినట్లు.. ఏదో భయంతో కుంచించుకుపోయినట్లు, చేతులు ముడుచుకుని ఉంటే శరీరంలో కార్డి సాల్ హార్మోను పెరుగుతుందట. మనలో ఒత్తిడికి ఇదే కారణం. అలా కాకుండా నిటారుగా భుజాలు విరిచి.. చేతులు రెండూ నడుంపై ఉ

ఎప్పుడూ వంగినట్లు.. ఏదో భయంతో కుంచించుకుపోయినట్లు, చేతులు ముడుచుకుని ఉంటే శరీరంలో కార్డి సాల్ హార్మోను పెరుగుతుందట. మనలో ఒత్తిడికి ఇదే కారణం. అలా కాకుండా నిటారుగా భుజాలు విరిచి.. చేతులు రెండూ నడుంపై ఉంచి నిల్చోవడం, వెన్నెముక భాగం పూర్తిగా కుర్చీకి అనేలా ప్రశాంతంగా కూర్చోవడం, కాస్త ముందుకు వంగి బల్లపై చేతులు ఉంచి సూటిగా చూస్తున్నట్లు నిల్చోవడం వంటివన్నీ టెస్టోస్టిరాన్ హార్మోన్‌ని పెంచుతాయని వైద్యులు చెప్తున్నారు. ఈ విధానం ద్వారా ఒత్తిడి తగ్గిపోతుంది. ధైర్యం పెరుగుతుంది. 
 
ఇలా రోజు  15 నిమిషాలు చేస్తే.. కచ్చితంగా ఒత్తిడి, ఆందోళనల నుంచి దూరం కావొచ్చునని వైద్యులు అంటున్నారు. రోజూ ఆఫీసుల్లో ఖాళీగా ఉన్న సమయంలో రెండు నుంచి ఐదు నిమిషాలు ఇలా నిల్చోవడం, కూర్చోవడం సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుందని.. దీన్ని వ్యాయామంగా చేస్తే ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు.