1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Modified: మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (20:26 IST)

సింహాద్రి అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన టిటిడి

తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఉదయం విశాఖపట్నం సమీపంలోని సింహాద్రి అప్పన్నకు పట్టువస్త్రాలు సమర్పించింది. దేవస్థానం తరపున టిటిడి ఈవో డివి సాంబశివరావు పట్టుపీతాంబరాలను అప్పగించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం గత కొన్నేళ్ళు వస్త్రాలను టిటిడి సమర్పిస్తోంది.  
 
వరలక్ష్మి నరసింహ స్వామి ఆలయం చాలా పురాతనమైనది. దానిని 11 శతాబ్దంలో నిర్మించినట్లు చెపుతారు. దేశంలోని 18 నరసింహ క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ విగ్రహం యేడాది పొడువునా చందన లేపనంతో కప్పబడి ఉంటుంది. ఒక పండుగ రోజు మాత్రమే స్వామి నిజరూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు. అదీ కేవలం 12 గంటలు మాత్రమే ఇలా నిజరూప దర్శనం కలుగుతుంది. అది అక్షయ తృతియ నాడు మాత్రమే భక్తులు స్వామి వారి నిజరూపాన్ని దర్శించుకోగలుగుతారు. 
 
అక్షయ తృతియ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టువస్త్రాలను ఇస్తారు. ఇందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డివి సాంబశివరావు, సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీనివాస రాజులు పాల్గొన్నారు.