శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (08:15 IST)

హమ్మయ్యా... మహమ్మారి నుంచి కోలుకున్నా... జేమ్స్ బాండ్ హీరోయిన్

ఉక్రెయిన్ దేశానికి చెందిన‌ న‌టి, మోడ‌ల్ ఓల్గా కురిలెంకో 2008లో వ‌చ్చిన 'జేమ్స్ బాండ్' చిత్రం క్వాంట‌మ్ ఆఫ్ సోలేక్‌, 2013లో వ‌చ్చిన సైంటిఫిక్ చిత్రాల‌తో పాపుల‌ర్ అయింది. ఈమెకు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమెను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఈమె ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. పైగా, తన కుమారుడుతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నట్టు ఓల్గా చెప్పుకొచ్చింది.
 
ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్న‌ానని, కుమారుడితో క‌లిసి విలువైన స‌మ‌యం గ‌డుపుతున్నాన‌ని తెలిపింది. అలానే త‌న పోస్ట్‌లో క‌రోనాకి సంబంధించిన అనుభ‌వాలు వివ‌రిస్తూ.. మొద‌టి వారం రోజులు చాలా క‌ష్టంగా గ‌డిచింది. తీవ్ర‌మైన జ్వరం, త‌ల‌నొప్పితో చాలా బాధ‌ప‌డ్డాను. రెండో వారంలో జ్వ‌రం త‌గ్గింది. కొద్దిగా ద‌గ్గు ఉండేది. అల‌సిపోయిన‌ట్టు అనిపించేది. రెండో వారం చివ‌ర‌లో ఆరోగ్యం కుదుట‌ప‌డ్డ‌ట్టు అయిందని ఓల్గా పేర్కొంది.