సెల్ఫీ కోసం ఎగబడిన అమ్మాయి.. పట్టించుకోకుండా వెళ్లిన కోహ్లీ

virat kohli
virat kohli
సెల్వి| Last Updated: శుక్రవారం, 20 మార్చి 2020 (14:39 IST)
దక్షిణాఫ్రికాతో మార్చి12 - 18 వరకూ జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌‌ని బీసీసీఐ కరోనా దెబ్బకి పూర్తిగా రద్దు చేయడంతో, టీమిండియా ఆటగాళ్లు అందరూ వారివారి స్వస్థలాలకి చేరుకున్నారు. అయితే ఈ పరిస్థితులలో లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న కోహ్లీతో సెల్ఫీ కోసం ఒక అమ్మాయి ప్రయత్నం చేసేసింది.

అక్కడ భారీ భద్రత నడుమ కోహ్లీ నడుచుకుంటూ వస్తుండగా అనూహ్యంగా అతని పక్కకి వచ్చిన అమ్మాయి తనతో సెల్ఫీ కోసం తన సెల్‌ఫోన్ ఇవ్వబోయింది.

కాకపోతే ఆ అమ్మాయి తనవైపు రావడాన్ని ముందే కనుగొన్న విరాట్ కోహ్లీ తన చూపు తిప్పుకుని అలానే ముందుకు నడుచుకుంటా వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూడా వెనక్కి తగ్గింది. కరోనా వైరస్ నేపథ్యంలో సెల్ఫీలకు కూడా కోహ్లీ నో చెప్పాడని టాక్ వస్తోంది,దీనిపై మరింత చదవండి :