నర్గీస్ ఫక్రీ: బాలీవుడ్‌లోనే సౌకర్యవంతంగా ఉంది!
హాలీవుడ్ కంటే బాలీవుడ్ బాగుంటుందని, బాలీవుడ్‌లోనే సౌకర్యవంతంగా ఉంటుందని నర్గీస్ ఫక్రీ అంటోంది. సాధారణంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చే హీరోయిన్లు తమకు దక్షిణాది తర్వాతే బాలీవుడ్ అంటూ ఉంటారు. వారిని చూసి నర్గీస్ ఫక్రీ స్ఫూర్తి పొందిందో లేక నిజం చెప్పిందో తెలియదు కానీ.. బాలీవుడ్ హాట్ గర్ల్ నర్గీస్ ఫక్రి హాలీవుడ్ కంటే బాలీవుడే బాగుంటుందని చెప్పింది.
'స్పై' సినిమాతో హాలీవుడ్ తెరంగేట్రం చేసిన నర్గీస్ ఫక్రీ బాలీవుడ్‌లోనే ఎక్కువ నేర్చుకున్నానని చెప్పింది. ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటుందని, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే పనిలో ఉన్నానని వెల్లడించింది. దేవుని ఆశీర్వాదం వల్లే తనకు పెద్దనటులతో నటించే అవకాశం వచ్చిందని, భాషా పరమైన సమస్యను ఎదుర్కోలేదని నర్గీస్ ఫక్రీ తెలిపింది.