శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 4 జులై 2023 (10:21 IST)

అలరించే ఇన్సిడియస్: ది రెడ్ డోర్ జులై 6న రాబోతుంది

The Red Door sene
The Red Door sene
ఇన్సిడియస్: ది రెడ్ డోర్ అనేది స్కాట్ టీమ్స్ స్క్రీన్‌ప్లే, లీ వాన్నెల్ కథ నుండి పాట్రిక్ విల్సన్ దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ చిత్రం. ఇది ఇన్సిడియస్ అండ్ ఇన్సిడియస్: చాప్టర్ 2కి ప్రత్యక్ష సీక్వెల్.  ఇన్‌సిడియస్  ప్రసిద్ధ హర్రర్ ఫ్రాంచైజీ కు 5వ ఐదవ భాగం ఈ సినిమా. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో జులై 6న గురువారం విడుదల కాబోతుంది.
 
The Red Door sene
The Red Door sene
ఇన్సిడియస్: చాప్టర్ 2కి ముగింపు సంఘటనల తర్వాత అనగా పది సంవత్సరాల తర్వాతప్రారంభం అవుతుంది. జోష్ లాంబెర్ట్ తన కొడుకు డాల్టన్‌ను ఒక ఇడిలిక్, ఐవీ-లీగ్ విశ్వవిద్యాలయంలో దింపడానికి తూర్పు వైపుకు వెళతాడు. అయినప్పటికీ, డాల్టన్ కళాశాల జేరడానికి ఒక పీడకలగా మారుతుంది, అతని చేత గతంలోని పనిష్ చేయ పడ్డ వారు (దెయ్యం లాంటి రాక్షసులు) అకస్మాత్తుగా వారిద్దరినీ వెంటాడడానికి తిరిగి వచ్చారు. హాంటింగ్‌ను అంతం చేయడానికి, రాక్షసులును ఒక్కసారిగా కంట్రోల్ తీసుకోవడానికి, లాంబెర్ట్ పీడకలని ఆపడానికి జోష్, డాల్టన్ మరోసారి ఏమిచేశారు అనేదే సినిమా.
 
ఈ ఫ్రాంచైజీ మునుపటి చిత్రాలలో ప్రధాన భాగమైన పాట్రిక్ విల్సన్, ఈ 5వ భాగం ద్వారా  దర్శకుడిగా పరిచయం అయ్యాడు. టై సింప్కిన్స్, రోజ్ బైర్న్ మరియు ఆండ్రూ ఆస్టర్. ఇతర తారాగణంలో సింక్లెయిర్ కూడా ఉన్నారు.  దర్శకత్వం-పాట్రిక్ విల్సన్, స్క్రీన్ ప్లే- స్కాట్ టీమ్స్.