గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (13:59 IST)

కొబ్బరిలో చక్కెర కలిపి సేవిస్తే..?

కొబ్బరిని దేవుళ్లకు సమర్పిస్తారు. ప్రసాదంగా కూడా స్వీకరిస్తారు. చాలామంది కొబ్బరి ఇంట్లో ఉంటే పచ్చడో లేదో కొబ్బరి అన్నమో చేసుకుని తింటుంటారు. ఈ పచ్చి కొబ్బరి పోషకాలు అధికం. కొబ్బరి శరీరానికి శక్తిని అందిస్తుంది. దీనిలోని పోషకాలు అవయవాలు చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. కొబ్బరిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
 
కొబ్బరిలో విటమిన్ ఎ, బి, సి నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్ల్, ఐరన్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. తరచు కొబ్బరి తీసుకుంటే మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు రావు. కొబ్బరి తినడం వలన శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది. కొబ్బరి శరీరంలోని నీటిశాతాన్ని కోల్పోకుండా చేస్తుంది. శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కొబ్బరిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. 
 
శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. దెబ్బతిన్న కణాలను వృద్ధి చేయడంలో కొబ్బరి కీలకపాత్ర పోషిస్తుంది. ఓ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా పటిక బెల్లం, చక్కెర, నానబెట్టిన పెసరపప్పు వేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమం కంటి చూపుకు చాలా మంచిది. రోజూ కొబ్బరి తీసుకోకపోయిన కనీసం వారంలో రెండు లేదా మూడుసార్లు సేవిస్తే ఫలితం ఉంటుంది.