గుండె జబ్బులకు మంచి మందు... రక్తంలో కొవ్వును కరిగించే పుట్టగొడుగులు!
ప్రస్తుతం గుండె జబ్బులు అధికమైపోతున్నాయి. అలాగే, ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు కేజీల చొప్పున ఉత్పత్తి అవుతుంది. దీనికి ప్రధాన కారణం సరైన శారీరక వ్యాయామం లేక పోవడంతో పాటు.. తీసుకునే ఆహారంలో విపరీతమైన మార
ప్రస్తుతం గుండె జబ్బులు అధికమైపోతున్నాయి. అలాగే, ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు కేజీల చొప్పున ఉత్పత్తి అవుతుంది. దీనికి ప్రధాన కారణం సరైన శారీరక వ్యాయామం లేక పోవడంతో పాటు.. తీసుకునే ఆహారంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోవడం.
అయితే, శరీరంతో పాటు... రక్తంలో చేరే కొవ్వును కరిగించి, గుండె జబ్బులకు చెక్ పెట్టే మంచి మందులా పుట్టగొడుగులు పని చేస్తాయి. ఇవి చూడటానికే కాదు.. తినేందుకు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇందులో పుష్కలంగా న్యూట్రీషన్లు ఉంటాయి.
ఇలాంటి పుట్టగొడుగులను ఆరగించడం వల్ల అధిక రక్తపోటుతో పాటు రక్తంలో కొవ్వు కరిగించాలంటే వారానికి రెండుసార్లు మష్రూమ్స్ తీసుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి.
మష్రూమ్స్‌లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. మష్రూమ్‌లో లెంటిసైన్, ఎరిటడెనిన్ అనేవి రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగేలా చేస్తుంది. అంతేకాదు కరిగిన కొవ్వును ఇతర భాగాలకు పంపి, శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది.
గుండె జబ్బులకు కూడా మష్రూమ్ మంచి మందుగా పని చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, సోడియం, గర్భ సంబంధిత రోగాలు, మోకాలి నొప్పులు రాకుండా చేస్తుంది. రోజూ మష్రూమ్స్ సూప్ తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నియంత్రించుతుంది.