మంగళవారం, 28 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 18 డిశెంబరు 2023 (18:56 IST)

ఉదయాన్నే కడుపులో మంట, ఎసడిటీ- ఇలా తగ్గించుకోవచ్చు

acidity
ఎసిడిటీ. చాలామంది తిన్న ఆహారం జీర్ణంకాక ఇబ్బంది పడుతుంటారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఛాతిలో నొప్పి కలిగినట్టుగా ఉంటుంది. నోటి నుంచి దుర్వాసన తదితర లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటివన్నీ ఎసిడిటీ లక్షణాలు. ఈ అసిడిటీని తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఉదయాన్నే పరగడుపునే నాలుగైదు పుదీనా ఆకులను నమిలి మింగితే ఎసిడిటీని తగ్గిస్తాయి.
భోజనం తర్వాత పుదీనా ఆకుల రసాన్ని నీటిలో కలుపుకుని తాగినా అసిడిటీ నుంచి బయట పడవచ్చు. తులసి ఆకులను భోజనానికి ముందు నములుతుంటే అసిడిటీ రాకుండా చూసుకోవచ్చు.
 
భోజనం చేసిన తర్వాత 20 నిమిషాలు ఆగి కొబ్బరినీళ్లు తాగాలి, దీనివల్ల అసిడిటీ తగ్గుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి తాగితే అసిడిటీ రాదు. చక్కెర లేకుండా చల్లని పాలు తాగాలి, లేదా చెంచా నెయ్యి కలిపిన పాలను తీసుకోవాలి.