1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: గురువారం, 19 అక్టోబరు 2023 (22:34 IST)

ఆరోగ్యవంతమైన బాదం ఆధారిత వంటకాలను తయారుచేయడం ద్వారా నవరాత్రి వేడుక జరుపుకోండి

Almond recipe
నృత్యం, భక్తి మరియు శక్తివంతమైన రంగుల సమ్మేళనంగా భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగలలో నవరాత్రి ఒకటి. ఇది భారతదేశంలో పండుగ మాత్రమే కాదు, విశ్వాసం, సంప్రదాయాల వేడుక. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పండుగ ఉత్సాహభరితమైన నృత్యాలు, రంగురంగుల దుస్తులు, దుర్గా దేవికి సామూహిక పూజల ద్వారా గుర్తించబడుతుంది. సంతోషకరమైన వేడుకల మధ్య, ఉపవాసం ఒక ప్రత్యేక సంప్రదాయంగా మిగిలిపోయింది. కానీ, ఈ వేడుకల వేళ మన మధురమైన కోరికలు బయటకు వస్తాయన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. ఈ అభిరుచులకు అడ్డుకట్ట వేసి ఆరోగ్యకరమైన పదార్థాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.

బాదంపప్పులు రుచిగా ఉంటాయి. అన్ని రకాల ఆహార పదార్థాలతో జతగా ఉంటాయి. బాదం యొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు అనేక ఆయుర్వేదం, యునాని, సిద్ధ గ్రంథాలలో వెల్లడి చేయబడ్డాయి. ప్రతిరోజూ బాదంపప్పును తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ, బరువు,  టైప్-2 మధుమేహం నిర్వహణలో కూడా సహాయపడుతుంది.

అంతేకాకుండా, బాదంలో విటమిన్ బి2, విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. నవరాత్రి కోసం బాదం చన్నా మసాలా, బాదామి నంఖాటై వంటి ఆరోగ్యకరమైన బాదం ఆధారిత వంటకాలను ప్రయత్నించండి. వీటిని తయారు చేసుకోవటం సులభం. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఈ ఉపవాస వేళ ఇవి ఆరోగ్యమూ అందిస్తాయి.