బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (10:24 IST)

వూహాన్‌కు కరోనాను తీసుకెళ్లిన భారత్.. ఎలాగంటే?

కరోనా వైరస్ పుట్టిన చైనాకు వెళ్ళిన ఎయిర్ ఇండియా విమానంలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. వూహాన్‌కు వెళ్ళిన 19 మంది భారతీయులకు కరోనా సోకింది. అక్కడికి వెళ్ళగా కరోనా టెస్ట్ లు చేయించుకోగా వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 
 
'వందే భారత్' విమానంలో ఉన్న వారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విమానంలో ప్రయాణికులందరూ సర్టిఫైడ్ ల్యాబ్‌ల నుండి నెగటివ్ రిపోర్ట్ లతో వెళ్ళారు అని కాని వారికి కరోనా సోకింది అని జాతీయ మీడియా పేర్కొంది.
 
తాము అన్ని నిబంధనలు పాటించామని ఎయిర్ ఇండియా చెప్పింది. నివేదికల ప్రకారం, మరో 39 మందికి లక్షణాలు లేకుండా కరోనా బారిన పడ్డారు. ఇతర దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలలో అవుట్‌ బౌండ్ ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నప్పుడు కరోనా బారిన పడటం ఇదే మొదటిసారి కాదు.