బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (13:13 IST)

సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా సైనిక దాడి-200 టెర్రరిస్టులు హతం

సిరియాలోని ఉగ్రవాద శిబిరాలపై రష్యా జరిపిన దాడిలో సుమారు 200 మంది తీవ్రవాదులు మృతి చెందినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో 24 వాహనాలు ధ్వంసం అయ్యాయని, మరో అర టన్ను పేలుడు పదార్ధాలు ధ్వంసం అయినట్లు సైన్యం పేర్కొంది. 
 
సిరియా ఉగ్రవాద శిబిరాలపై దాడి జరిగినట్లు రష్యా అడ్మిరల్‌ అలక్సందర్‌ కార్పొవ్‌ దృవీకరించారు. సిరియాకు ఈశాన్యంలో ఉన్న పల్మైరాలో పలు ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని.. ఇక్కడ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నారని అన్నారు. 
 
ఇక్కడ అక్రమంగా పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించామని, ఈ ప్రాంతం సిరియా ఆధీనంలో లేదని రష్యా ఆర్మీ తెలిపింది. అర టన్ను పేలుడు పదార్థాలు ధ్వంసమైనట్లు రష్యా వైమానిక దళం అధికారి అలక్సందర్ కార్పోవ్ తెలిపారు. 
 
పల్మైరా ప్రాంతంలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతుండడంతో పాటు భారీ మొత్తంలో మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండడంతో దాడులు జరిగినట్టు సమాచారం. 2015 నుంచి సిరియాలో ఉగ్రవాదులపై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. ఇద్దరు రష్యా సైనికులను గతంలో చంపడంతో ఈ దాడులకు రష్యా పాల్పడుతున్నట్టు సమాచారం.