శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 25 నవంబరు 2019 (10:08 IST)

జనావాసాల్లో కుప్పకూలిన విమానం, 23మంది మృతి

ఆఫ్రికా దేశం డీఆర్‌ కాంగోలో విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. కాంగోలోని విమానాశ్రయం నుంచి ఉదయం 9 గంటల సమయంలో విమానం టేకాఫ్‌ అవుతుండగా ఇళ్ల మధ్యలో కూలింది. ఇందులో 19 మంది ప్రయాణికులు సహా కొందరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. గోమా నుంచి బయలుదేరిన బిజీబీ ఎయిర్‌ లైన్స్‌కు చెందిన డోర్నియర్‌–228 రకం విమానం 350 కిలోమీటర్ల దూరంలోని బెని చేరుకోవాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
 
విమానంలో 19 మంది ప్రయాణికులు,  సిబ్బంది సహా మొత్తం 23మంది ఉన్నారు. ఐతే వీరిలో ఎవరూ ప్రాణాలతో బయటపడినట్లు దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. బిజీ బీ విమానయాన సంస్థకు చెందిన డోర్నియర్-228 విమానం గోమా ఎయిర్ పోర్టు నుంచి 350 కి.మీ. దూరంలో ఉన్న బేనీకి వెళ్లాల్సి ఉంది. 
 
ఐతే గోమా ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయిన కాసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి జనావాసాల్లో విమానం కుప్పకూలింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటి వరకు ఆరుగురు మృతదేహాలను బయటకు తీశామని.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.