బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (07:33 IST)

అమెరికాలో మళ్లీ గర్జించిన తుపాకీలు - 8 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకులు మళ్లీ గర్జించాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు పోలీస్ అధికారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 
 
నగర శివారులోని గార్లాండ్‌లో ఉన్న ఓ దుకాణంలోకి వచ్చిన దుండగుడు పికప్ ట్రక్‌లో బయటకువెళ్లి, మళ్లీ వెంటనే తిరిగి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ వెంటనే అదే ట్రక్కులో పారిపోయాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 
 
అదేవిధంగా డెన్వర్‌లో సమీపంలో జరిగిన మరో ఘటనలో పోలీస్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. నగర సమీపంలోని ఓ వాణిజ్య దుకాణంలోకి వచ్చిన ఓ దండుగు కాల్పులు జరిపారు. 
 
ఈ దుండగుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయాడు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రెండు తుపాకీ ఘటనలో ఇద్దరు మహిళల, ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోవడం విచారకరం.