గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (19:07 IST)

జో బైడెన్ కార్యాలయంలో భారతీయ సంతతి వ్యక్తి గౌతం రాఘవన్‌కు టాప్ పొజిషన్

ఫోటో కర్టెసి-ట్విట్టర్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్యాలయంలో మరో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ అగ్రగామిగా నిలిచారు. శుక్రవారం, అధ్యక్షుడు జో బైడెన్, భారతీయ అమెరికన్ గౌతమ్ రాఘవన్‌ను వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ హెడ్‌గా నియమించారు. గౌతమ్ రాఘవన్ భారతదేశంలో పుట్టి, సియాటిల్‌లో పెరిగారు. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన మొదటి తరం వలసదారు.

 
ఈ గౌతం రాఘవన్ ఎవరు?
గౌతమ్ రాఘవన్ భారతీయ అమెరికన్ రాజకీయ సలహాదారు. ఆయన వైట్ హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్. జనవరి 20, 2020 నుండి ప్రెసిడెంట్‌కు డిప్యూటీ అసిస్టెంట్‌గానూ, వైట్ హౌస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు.
 
 
 
గతంలో, ఆయన బిడెన్-హారిస్ ట్రాన్సిషన్ టీమ్ ద్వారా నియమించబడిన మొదటి ఉద్యోగి. అక్కడ ఆయన అధ్యక్ష నియామకాల డిప్యూటీ హెడ్‌గా పనిచేశాడు. గౌతమ్ రాఘవన్ 2008లో ఒబామా పరిపాలనా కాలంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ క్యాంపెయిన్, డెమోక్రటిక్ నేషనల్ కమిటీకి కూడా పనిచేశారు. ఐతే గౌతం స్వలింగ సంపర్కుడు. తన కుమార్తె, భర్తతో కలిసి వుంటున్నారు.